TEJA NEWS

మహిళల స్వయం సమృద్ధే ఇన్నర్‌వీల్ క్ల‌బ్ ల‌క్ష్యం

ఆరుగురు పేద మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు అంద‌జేత‌

చిల‌క‌లూరిపేట‌: మ‌హిళ‌లు స్వ‌యం ఉపాధి ద్వారా ఆర్దికాభివృద్ది సాధించాల‌ని ఇన్న‌ర్ వీల్ క్ల‌బ్ ఆఫ్ చిల‌క‌లూరిపేట అధ్య‌క్షురాలు గ‌ట్టు స‌రోజిని అన్నారు. ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో ప‌ట్ట‌ణంలోని రోట‌రీ క‌మ్యూనిటీ హాలులో ఆరుగురు పేద మ‌హిళ‌ల‌కు జీవ‌నోపాధి నిమిత్తం కుట్టు మిష‌న్లు ఉచితంగా అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా స‌రోజిని మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందినప్పుడే ఆ కుటుంబం.. తద్వారా సమాజం అన్ని విధాలా ప్రగతి సాధిస్తుందని వెల్ల‌డించారు.

స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నదే ఇన్న‌ర్‌వీల్ క్ల‌బ్ ల‌క్ష్య‌మ‌ని, ఇందులో భాగంగానే క్ల‌బ్ త‌రుఫున అనేక కార్య‌క్ర‌మాలు చేసిన‌ట్లు వివ‌రించారు.ఈ కార్య‌క్రమానికి క్ల‌బ్ పూర్వ అధ్య‌క్షురాలు పల్లపోతుల విజయలక్ష్మి ,పోతినేని పద్మావతి స‌భ్యులు కందిమల్ల భారతీ ,మండవ పద్మావతి ,డాక్ట‌ర్‌ వరలక్ష్మి లు 2 కుట్టు మిషన్లు, మిగిలిన స‌భ్యుల ఆర్దిక స‌హ‌కారం అందించిన‌ట్లు వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో క్ల‌బ్‌ సెక్రటరీ నార్నే జయలక్ష్మి ,కుట్టు మిషన్ల దాతలు, క్ల‌బ్ స‌భ్యులు పాల్గొన్నారు.


TEJA NEWS