తెలంగాణకు ఏడు నవోదయ విశ్వవిద్యాలయాలు మంజూరు
హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు కొత్తగా 7 నవోదయ విశ్వవిద్యాలయలను మంజూరు చేసింది, ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశవ్యా ప్తంగా ఏడు రాష్ట్రాల్లో 28 నవోదయ విశ్వవిద్యాల యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది,
ఇందులో తెలంగాణకు 7 జవహర్ నవోదయ విద్యాలయాలు.. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రకటించింది కేంద్రం. ఇక తెలంగాణలో 7 నూతన జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన చేశారు.
ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో 7 నూతన జవహర్ నవోదయ విద్యాలయా(JNV)లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజలతో పాటుగా, వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో దాదాపు రూ.340 కోట్లతో ఏర్పాటు చెయ్యనున్నారు .
ఈ 7 నవోదయ విశ్వవి ద్యాలయాల ద్వారా మరో 4,000 మంది తెలంగాణ విద్యార్థులకు 6 నుండి 12 వ తరగతి వరకు హాస్టల్ వసతితో సహా అత్యున్న తమైన ప్రమాణాలతో కూడిన విద్య అందనుంది. 330 మందికి కొత్తగా ఉపాధి లభించనుందని తెలిపారు.
ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులో వలసపల్లె, సత్య సాయి జిల్లాలో పాలసముద్రం, గుంటూరులో తాళ్లపల్లె, రొంపిచర్ల, కృష్ణాలో నూజివీడు, నందిగామ, నంద్యాలలోని డోన్లో KVBల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది