TEJA NEWS

26 ఏళ్ల తర్వాత కలుసుకున్న సెవెంత్ క్లాస్ విద్యార్థులు

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని టంగటూరు ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 1997-98 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. బాల్యంలో విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు. కీర్తిశేషులు నారాయణ సార్ ని విద్యార్థులు స్మరించుకున్నారు. విద్య నేర్పిన గురువులను వారు ఘనంగా సన్మానించారు. తమ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలుసుకున్న ఉపాధ్యాయయులు ఆనందించారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుకొని తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాండు, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుండాలరావు, విట్టల్, సురేందర్ పాల్గొన్నారు.


TEJA NEWS