పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్

TEJA NEWS

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్❓️

ఇస్లామాబాద్:ఫిబ్రవరి 21
పాకిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది.

సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్ (పిఎంఎల్- నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)ల మధ్య ఒప్పందం కుదిరింది.

ఈ మేరకు పిఎంఎల్-నవాజ్ పార్టీ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవిని, పిపిపి కో చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షతన పదవిని చేపడతారు.

దాదాపు 100కుపైగా నియోజకవర్గాల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించినా, వారు విఫలమయ్యారని షరీఫ్ చెప్పారు.

తమ సంకీర్ణ ప్రభుత్వానికి ముత్తహీద క్వామీ మూవ్ మెంట్- పాకిస్తాన్, పాకిస్తాన్ ముస్లింలీగ్, ఇష్టెకామ్ ఏ పాకిస్తాన్ పార్టీల మద్దతు ఉంటుందన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS