
షిర్డీసాయి నాధుని నామ స్మరణ తో మారుమ్రోగిన నాదేండ్ల
ఘనంగా శిరిడీ సాయినాధుని మందిర వార్షికోత్సవ వేడుకలు
ప్రత్యేక పూజలు చేసిన భక్తులు…. 1500ల మందికి మహా అన్నదానం
కార్యక్రమాల క్రతువు ను పర్యవేక్షించిన గ్రామ పెద్దలు
నాదేండ్ల గ్రామం లో వెంచేసి ఉన్న శ్రీ శిరిడీ సాయి నాధుని మందిర 13వ వార్షికోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవం గా, కన్నుల పండుగ గా జరిగాయి.
వేకువ జామునుంచే సాయిబాబా కు విశేషా పూజలు, పంచంబృతాలతో అభిషేకం, గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
వివిధ రకాల పూలతో సాయిబాబా ను అందం గా అలంకరణ చేశారు. గ్రామస్తులు సాయిబాబా ను దర్శించుకొని ఆశీస్సులు పొందారు.
అనంతరం మహా అన్నదానం జరిగింది. నాదేండ్ల పోలీస్ లు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
