
ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి.. ప్రతి డివిజన్లో సమీక్ష నిర్వహించిన బొంతల రాజేష్….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని అన్ని డివిజన్లలో ప్రత్యేక పర్యటన నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా ప్రతి డివిజన్లోని బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏలు) కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఎంత శాతం నమోదు పూర్తయింది, షిఫ్టెడ్ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలు వంటి అంశాలను అడిగి తెలుసుకుని, ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం 20వ డివిజన్లో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కూడా బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు), బీఎల్ఏలకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మారెల్లి సుశీల రాజిరెడ్డి, శంకర్ నాయక్, దేవనపల్లి చక్రపాణి, అనుము స్వరూప రాములు, డివిజన్ ఇన్చార్జులు గడ్డం తిరుపతి, బత్తిని శ్రీనివాస్, బండ రమేష్ రెడ్డి, బూత్ ఇన్చార్జులు బుచ్చిరెడ్డి, గుంపుల ఓదెలు, ఎంఏ అమిత్, డివిజన్ అధ్యక్షుడు మార్క్ రాజు, 8వ కాలనీ సోషల్ మీడియా ఇన్చార్జ్ మేకల అజయ్, బీఎల్ఏలు బోల్లం రాజు, పూజారి రాకేష్, ఎండీ అసిముద్దీన్, షకీల్, సుమలత, రజిత, మెరుగు రాజేష్, పరకాల ప్రశాంత్, మారం కుమార్, లక్ష్మణ్, డి. స్వప్న, రాజ్ కుమార్, మల్లేష్, బి. సంతోష్, అంజి, ఎండీ రఫీ, పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.