Six Kondakal students selected for NMMS scholarship
కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించే ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) టెస్ట్ గత విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన పరీక్ష ఫలితాలు నిన్న రాత్రి విడుదలయ్యాయి. అందులో శంకర్ పల్లి మండలంలోని కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు. కొండకల్ పాఠశాల నుండి 15 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 6 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరము ప్రభుత్వము నుండి 12 వేల రూపాయలు స్కాలర్షిప్ ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు అండుతుంది. కొండకల్ పాఠశాల నుండి
- లోహిత్ కుమార్
- మన్నె శృతి
- గండ్ర శిరీష
- ఎరుకల దీపిక
- ఎరుకల దీక్షిత
- రేపాని సుమలత లు ఎంపికయ్యారు ఈరోజు పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి జీవనజ్యోతి పాఠశాల ఉపాధ్యాయులు రఘునందన్ రెడ్డి, అంజిరెడ్డి,రామకృష్ణా రావు, కుసుమకుమారి, సుజాత, జంగయ్య, రాములు, వెంకటేశం, రాధ, హరికృష్ణ, యాదయ్య, అరుంధతి లు విద్యార్థులను అభినందించారు