TEJA NEWS

గిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చతిస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు మరియు సాధారణ భక్తులు అంజన్న దర్శనానికి వస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు జగిత్యాల పట్టణానికి చెందిన మూసిపట్ల వెంకట రమణయ్య, వెంకట లక్ష్మీ జ్ఞాపకార్థం వారి కుమారుడు, జయశ్రీ ప్రింటర్స్ అధినేత మూసిపట్ల దేవేందర్, వారి సతీమణి భాగ్యలక్ష్మి, కూతురు కౌముది లు త్రాగునీరు, అరటిపండ్లు, మజ్జిగ ను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం తో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం చిన్న జయంతి మరియు పెద్ద జయంతి సందర్భంగా సేవ చేస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా త్రాగునీరు, అరటిపండ్లు, మజ్జిగ ను అందిస్తుండటం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


TEJA NEWS