TEJA NEWS

కాసిపేట 1 టన్నెల్ గనిని సందర్శిచిన SO to డైరెక్టర్.

కాసిపేట1 గనిని ఎస్ ఓ టు డైరెక్టర్ జి. నాగేశ్వరరావు గారు సందర్శించడం జరిగింది. గతంలో ఇక్కడ మేనేజర్ గా,ఏజెంట్ గా,ఏరియా రక్షణ అధికారిగా పనిచేసి పదోన్నతి పై కొత్తగూడెం హెడ్ ఆపీస్ లో డైరెక్టర్ ప్రాజెక్టు & ప్లానింగ్ విభాగంలో ఎస్ ఓ టు డైరెక్టర్ విధులు నిర్వహిస్తూ కాసిపేట టన్నెల్ మెయిన్ పనులను,మ్యాన్ రైడింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పనులను వేగవంతం చేసి బొగ్గు ఉత్పత్తిని తీసుకురావాలని, ఉద్యోగులకు మ్యాన్ రైడింగ్ త్వరగా ఏర్పాటు చేయడం వల్ల పని స్థలాలకు త్వరగా వెళ్లేందుకు వీలుగా ఉంటుందని,శ్రమభారం తగ్గించడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా కాసిపేట గని అనుకూలమైనదని ఉత్పత్తి రావడానికి అనుకులమైనదని,కాసిపేట గని లో పని చేస్తున్న ఉద్యోగులు మంచి నైపుణ్యం కలిగిన వారని ఎంతటి పనినైనా చేయగల సమర్థత ఉన్నవారని, ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిన వారని అన్నారు.కాసిపేట గనిలో పని చేయడము గొప్ప అవకాశమని,ఇక్కడ పని చేసిన కార్మికులు,అధికారులు ఎక్కడైనా సమర్ధవంతంగా చేయగలరని అన్నారు.

ఎస్ ఓ టు డైరెక్టర్ గారిని సన్మానించిన అధికారులు,నాయకులు.

కాసిపేట గనికి వచ్చిన సందర్బంగా ఏజెంట్ రామదాసు గారు మేనేజర్ అల్లావుద్దీన్ గారు ఘనంగా సన్మానించారు.అలాగే ఏఐటీయూసీ బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్,రాజేందర్,నాగేశ్వరరావు, TBGKS నాయకులు బైరి శంకర్,సోల్లంకి శ్రీనివాస్, SC/ST అసోషియేషన్ నాయకులు బన్న లక్ష్మన్ దాస్ సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్ ఓ సునీల్ కుమార్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్,ఇంజనీర్లు బాబు,మధుకర్,డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, నిఖిల్, సుమన్,వంశీ కృష్ణ,దిలీప్,రామకృష్ణ,వెంకటేశ్వర రావు, ఖాన్,తదితరులు పాల్గొన్నారు.

కాసిపేట టన్నెల్ గని వద్ద మొక్కలు నాటిన ఎస్ ఓ టు డైరెక్టర్.

కాసిపేట టన్నెల్ గని ని సందర్శించి పనులను పర్యవేక్షించే ముందుఎస్ ఓ టు డైరెక్టర్ నాగేశ్వరరావు గారు మొక్కలను నాటడం జరిగింది.వారితో పాటు మొక్కలు నాటిన ఏజెంట్ రామ దాసు,మేనేజర్ అల్లావుద్దీన్, నాయకులు దాగం మల్లేష్ అధికారులు.


TEJA NEWS