శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నెహ్రు నగర్, గోపినగర్ లలో పాదయాత్ర చేపట్టిన కార్పొరేటర్
శేరిలింగంపల్లి డివిజన్ లోగల నెహ్రూ నగర్, గోపినగర్ లలో నూతనంగా చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు మరియు తదితర సమస్యలపై ఎలక్ట్రికల్ బృందం, HMWSSB, జిహెచ్ఎంసి సంబంధిత అధికారులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక వాసులు కార్పొరేటర్ కి పలు సమస్యలను వివరించగా ఏ చిన్న సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..గోపి నగర్, నెహ్రూ నగర్ లలో సీసీ రోడ్లు దాదాపుగా పూర్తవ్వగా మిగిలిన చోట్ల ఎమ్మెల్యే తో, అధికారులతో చర్చించి త్వరలోనే సీసీ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తానని తెలిపారు.
డివిజన్ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో కాలనీల వారిగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలను తొలగించి క్రమపద్ధతిగా ఏర్పాటు చేసి, కరెంట్ వైర్లను ఇండ్లపై వేలాడకుండా సరైన విధంగా సమకూర్చాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కార్పొరేటర్ ఆదేశించారు. స్థానికవాసులు సీసీ రోడ్డు వేసే సమయంలో సంబంధిత అధికారులకు వారి బృందానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్, ఎలక్ట్రికల్ నల్లగండ్ల సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్ శ్యామ్, కాన్స్టిట్యూన్సీ జనరల్ సెక్రటరీ యాదా గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపి నగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, నెహ్రు నగర్ యూత్ ప్రెసిడెంట్ గఫ్ఫర్, బాపునగర్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ ముదిరాజ్, నర్సింహా, మహేందర్ సింగ్, దస్తగిర్, తుకారామ్, షైక్ రాజాక్, గఫుర్, సాయి కిరణ్ గౌడ్, రంజిత్, యాకయ్య, మల్లేశం, ఉపేందర్, శంకర్ సింగ్, సర్వేష్, విజయ్, హరీష్, ఫకృద్దీన్, రమేష్, రవి, రియాజ్, ఖాజా, ఇజాజ్, ఇలియాజ్ మహిళలు దివ్య, నిరూప, గౌసియా బేగం, మేరీ, పుష్ప, అనుపమ స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.