చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక పోలీసు బృందాలు
👉 గంజాయి వంటి వ్యవస్థీకృత నేరాల కట్టడికి ప్రణాళిక
👉 విజబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణపై దృష్టి
👉 ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో పటిష్టంగా సిటీ పోలీసు యాక్టు అమలు
👉 నేరసమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్
చట్టవ్యతిరేక కార్యకలాపాలను చెక్ పెట్టేందుకు ప్రతేక చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
పోలీస్ కాన్ఫరెన్స్ హల్ లో మంగళవారం జరిగిన నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
జిల్లాలో శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, మత్తుపదార్థాల రవాణా, విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని మాధకద్రవ్యాల సరఫరా మూలాలకు సంబంధించిన అన్ని అనుసంధానాలను గుర్తించి కట్టడి చేసేలా
నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్లు తెలిపారు.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో బహిరంగ మద్యపానం, పబ్లిక్ న్యూసెన్స్, రాష్ డ్రైవింగ్, రాత్రి సమయాల్లో సమయానికి మించిషాపులు తెరవడం, పని లేకున్నా రోడ్లపై రావడం, పుట్టినరోజు వేడుకలు రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై సిటీ పోలీసు యాక్టు ఖచ్చితంగా అమలు చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
పాత నేరస్తుల కదలికలను నిఘా పెట్టాలని తరచూ నేరాలు చేసే కరుడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. చోరి సోత్తు రికవరీపై సెంట్రల్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించాలని ఆదేశించారు.
దీర్ఘకాలిక పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారంట్ ఎగ్జిక్యూట్ ,లోక్ అదాలత్ లో కక్షిదారులకు సత్వర న్యాయం, పరిష్కారాని తీసుకొవాల్సిన చోరవపై సమీక్ష నిర్వహించారు.
వివిధ కేసుల దర్యాప్తుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అన్నారు.
విచారణలో వున్న గ్రేవ్ కేసుల వివరాలను, ఎస్.సి., ఎస్.టి. కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. విచారణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పోక్సో కేసులు,( U/I )అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలు, పెండింగ్ ఉన్న ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, పోస్టుమార్టం రిపోర్ట్స్, నేరస్తుల అరెస్టు చేయని కేసులలో నేరస్తులను అరెస్టు చేసి త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి చార్జిషీట్ దఖాలు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు,AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ట్రైనీ ఏఎస్పీ మౌనిక, ఏసీపీలు గణేష్, ప్రసన్న కుమార్, హరికృష్ణ,భస్వారెడ్డి, రహెమాన్, రామనుజం, సారంగపాణి, కృపాకర్, రవి, శివరామయ్య, శంకర్,
నర్సయ్య, సుశీల్ సింగ్, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.