🔊ఎద్దుల కొమ్ములకు ప్లాస్టిక్ తొడుగులు
🔹జల్లికట్టు పోటీల్లో ప్రత్యేక రక్షణ చర్యలు
🍥ప్యారిస్, న్యూస్‌టుడే: జల్లికట్టు పోటీల్లో ఎవరూ తీవ్రంగా గాయపడకుండా… ప్రాణనష్టం సంభవించకుండా చూసేందుకు తమిళనాడు ప్రభుత్వం సన్నద్ధమైంది
❇️ఎద్దుల్ని లొంగదీసే క్రమంలో అవి పొడిచినా ఎదుటి వారికి గాయాలు కాకుండా వాటి కొమ్ములకు రబ్బరు లేదా ప్లాస్టిక్ తొడుగుల్ని అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం, జంతు సంక్షేమ బోర్డు నిర్ణయించాయి. సంక్రాంతి సందర్భంగా ఏటా తమిళనాడులోని మదురై, పుదుక్కోట్టై, తంజావూర్ జిల్లాల్లో వైభవంగా జల్లికట్టును నిర్వహిస్తారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోటీల్లో 8 వేల మంది గాయపడ్డారు