TEJA NEWS

రెండు రోజులు ప్రత్యేక ఓటరు నమోదు

పెద్దపల్లి జిల్లా: జనవరి 19
18ఏళ్లు నిండిన, యువతి, యువకులు, ఇప్పటి వరకు ఓటు నమోదు చేసుకోని వారి కోసం ఈనెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముత్తారం మండల తహశీల్దార్ రాజేశ్వరి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ శని, ఆదివారాల్లో మండలంలోని 25 పోలింగ్ కేంద్రాలలో 01-01-2024నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఫారం6, సవరణలకు ఫారం8, తొలగింపుకు ఫారం7 ద్వారా దరఖాస్తులను బిఎల్ఓలకు అందజేయాలన్నారు


TEJA NEWS