TEJA NEWS

క్రీడలు విద్యార్థులలో ప్రతిభను గుర్తిస్తాయి: చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య …

చేవెళ్ల నియోజకవర్గం
నవాబుపేట్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీ.ఎం కప్ ఆటలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన స్థానిక శాసనసభ్యులు కాలేయాదయ్య …

ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఆటలు మరియు క్రీడల ప్రాముఖ్యత,యుగాలుగా, క్రీడలు ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉండటానికి ఒక మార్గంగా పరిగణించబడుతాయి, కానీ అది అంతకు మించినది. నేడు, విద్యార్థుల మొత్తం ఎదుగుదలకు మరియు అభివృద్ధికి క్రీడలు చాలా అవసరం. వివిధ క్రీడలు ఆడటం వలన జట్టుకృషి, నాయకత్వం, జవాబుదారీతనం, సహనం మరియు ఆత్మవిశ్వాసం వంటి జీవిత నైపుణ్యాలను నేర్పించడంలో వారికి సహాయపడుతుంది మరియు జీవిత సవాళ్లను ఎదుర్కొనేందుకు వారిని సిద్ధం చేస్తుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ గీతా సింగ్ నాయక్ , సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, PACS చైర్మన్ పి రామ్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకటరెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు టి శేఖర్, ప్రకాశం, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి ఎక్సర్పంచ్ పి భీమిరెడ్డి , కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు…


TEJA NEWS