శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సీత ప్రయాణం కృష్ణతో చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు
శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సీత ప్రయాణం కృష్ణతో చిత్ర యూనిట్ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకులు సాయి శివ ఆధ్వర్యంలో చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. రోజా భారతి మాట్లాడుతూ 2025 జనవరిలో విడుదల కాబోతున్న సినిమా పోస్టర్ ను ఆలయ ఆవరణలో శివుని ఆశీస్సులతో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర యూనిట్ ను ఆలయ కమిటీ శేష వస్త్రాలతో సన్మానించి, స్వామి వారి చిత్రపటాలను బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ ఆల్ ఇండియా చైర్మన్ దయాకర్ స్వామి, గౌరవాధ్యక్షులు సదానందం గౌడ్, చైర్మన్ గోపాల్ రెడ్డి, లీలావతి, గోపాల్, ప్రమోద్ ఉన్నారు.