వైభవంగా శ్రీ కాలభైరవ స్వామి హోమం
తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ కాలభైరవ స్వామివారి హోమం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు.
నవంబర్ 07 వరకు ఛండీహోమం
కపిలేశ్వర ఆలయంలో గురువారం (నేటి) నుంచి నవంబర్ 07 వరకు 9 రోజుల పాటు జరుగనున్న శ్రీ కామాక్షి అమ్మవారి ఛండీ హోమానికి బుధవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
