TEJA NEWS

శ్రీశ్రీశ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి పాలాభిషేకం మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా గారు


తిరుత్తణి తాలూకా మద్దూరు గ్రామం నందు శ్రీశ్రీశ్రీ మహిషాసురమర్దని అమ్మవారి 25వ వార్శికోత్సవం మరియు తమిళ నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన 1008 కుండల పాలాభిషేక మహోత్సవంలో రాష్ట్ర మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా పాల్గొన్నారు.

సాంప్రదాయ కళాకారుల నాట్యాలతో అంగరంగ వైభవంగా, అమ్మవారికి 1008 పాలకుండలతో జరిగిన ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన విశేష పూజ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మాజీ మంత్రి కి ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం మాజీ మంత్రి శ్రీమతి ఆర్. కె. రోజా ని శాలువా, ప్రసాదాలతో సత్కరించారు.

ఈ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.