TEJA NEWS

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించిన…….. మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్

వనపర్తి : కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నీపురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ స్వాతంత్రం కోసం హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన వ్యక్తిని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలి మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ఉద్యమాన్నిముందుండి నడిపించారని
96 సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం ఢిల్లీజంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన యోధుడని కొనియాడారు. స్వాతంత్రం అనంతరం పార్లమెంటులో ఉప సభాపతిగా శాసనసభ్యులుగా మంత్రిగా సేవలందించారని మహా వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే సలహా సంఘం మాజీ సభ్యులు అచ్యుత రామారావు అడ్వకేట్ బుచ్చన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ రెడ్డి నందిపేట తిరుపతయ్య షఫీ మణిగిల్ల శివ యాదవ్ ఫోటోగ్రాఫర్ బాలరాజు యువనాయకులు రాహుల్ చిరంజీవి క్యాంప్ ఆఫీస్ సిబ్బంది కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS