TEJA NEWS

ఏవో కి వినతిపత్రం అందజేసిన గ్రామీణ వైద్యుల సమాఖ్య నాయకులు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఉమ్మడి జిల్లాలో ఉన్న గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ప్రారంభించాలని గ్రామీణ వైద్యుల సమాఖ్య సంఘాల జెఎసి నాయకులు ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా అద్యక్షార్యదర్శులు బొమ్మినేని కొండలరావు బోయినపల్లి శ్రీనివాస్ రావు మైనారిటీ సంఘం రాష్ట్ర నాయకులు నజీర్ధున్ జిల్లా అద్యక్షుడు హసన్ గ్రామీణ పట్టణ ఐక్యవేదిక అద్యక్షుడు పిల్లలమర్రి సుబ్బారావు లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆర్ఎంపి ల ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ల పై ఎన్ఎంసి టిస్ఎంఎసి లు కలిసి సంయుక్తంగా చేస్తున్న దాడులపై డిఎండ్ హెచ్ఎం కార్యలయంలో అందుబాటులో ఉన్న ఏవో మోత్యా నాయక్ కి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో తమకు శిక్షణ ఇచ్చారని తిరిగి అదే తరహ శిక్షణ ఇవ్వాలన్నారు.

ఆర్ఎంపిలకు అండగా నిలవండి…

నున్నా ని కలిసిన గ్రామీణ వైద్యుల సమాఖ్య (జెఎసి)సంఘాల నాయకులు…

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అతీ తక్కువ ఖర్చుతో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తున్న తమ పై ఎన్ఎంసి టిఎస్ఎంఎసి చేస్తున్న దాడులతో ఇబ్బందులు పడుతున్నామని తమకు అండగా నిలవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ని సీపీఎం కార్యలయంలో కలసి సమస్యలు వివరించారు.ప్రధాన సమస్య అయిన 428 జీవో ని సవరించాలని అ జీవో సవరించే వరకు తమకు మద్దతుగా నిలవాలన్నారు.ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో మాట్లాడి అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టికి విషయాన్ని తీసుకెళ్దామని హమీ ఇచ్చారు. మీ వెంట సీపీఎం పార్టీ ఉంటుందన్నారు. పరిమితికి మించి వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వైద్యం చేయకుండా ప్రాథమిక చికిత్స మాత్రమే ఇవ్వాలన్నారు.ఈకార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సమాఖ్య (జెఎసి)నాయకులు కొంగర గోపి ఎస్వీ రామారావు షేక్ నాగుల్ మీరా గోపాల్ పుల్లారెడ్డి రహీం రబ్బానీ రామారావు ఖదీర్ ఖాసీం పాషా తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS