TEJA NEWS

నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి : వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ *

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 125 – గాజులరామారం డివిజన్ లాల్ సాహెబ్ గూడ, డి. పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు చెందిన ప్రజలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని కలిసి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని లాల్ సాహెబ్ గూడలో మునుపెన్నడూ లేనివిధంగా నీటి సరఫరా వారానికి ఒకసారి జరుగుతుందని, అదేవిధంగా డి.పోచంపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నీటి కనెక్షన్ లు అందించి నియోజకవర్గంలో నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా యుద్దప్రాతిపాదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి

TEJA NEWS