TEJA NEWS

తిరుపతి లడ్డును కలుషితం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: శంకర్‌పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షుడు బండమీది వెంకటేష్


శంకర్‌పల్లి : భారతీయులందరూ ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డును కలుషితం చేసిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని శంకర్‌పల్లి మండల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు బండమీది వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ పవిత్రమైన లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో చేపల కొవ్వుతో పాటు ఇతర జంతువుల కళేబరాల నుంచి సేకరించిన నూనెను కలపడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, అధికారులపై ప్రభుత్వం అతి కఠినాత్మకంగా విచారించి వారిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా కుట్ర చేసిన వారి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండడం కోసం బాధ్యులైన వారిని రాళ్లతో కొట్టి చంపాలని వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల దేశవాళీ గోవులను కొండపై పెంచితే ఇలాంటి కల్తీలను అడ్డుకట్ట వేయవచ్చని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


TEJA NEWS