ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవు
సూర్యపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ను సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం తనకి నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల వారు పాటిస్తున్నటువంటి పరికరాల అనుమతులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీహాన్ హాస్పిటల్, సాయి దీప్తి నర్సింగ్ హోమ్, సాయి ప్రసాద్ హాస్పిటల్, వికేర్ హాస్పిటల్స్ పనితీరును రిజిస్ట్రేషన్ పొందుటకు ఉన్నటువంటి అర్హతలను అందిస్తున్న క్వాలిటీ వైద్య సేవలను అవసరమైన మేరకు ఉన్నటువంటి సిబ్బందిని ఫీజుల పట్టికలను నిర్వహణన ప్రైవేట్ హాస్పిటల్స్ నియమ నిబంధనల ప్రకారం వారు సమర్పించినటువంటి పత్రులను తనిఖీ చేసి వారికి తగిన అర్హతలు ఉన్నాయని గుర్తించారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం నియమ నిబంధనలను ఉల్లంఘించినయడల తగిన చర్యలు తీసుకుంటామని సర్టిఫికెట్లను రద్దు చేయబడతాయని హెచ్చరించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో మేనేజింగ్ డైరెక్టర్ కానీ డాక్టర్ కానీ మారిన వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సరిదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.