TEJA NEWS

పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ ని మెరుగుపర్చక పోతే కఠిన చర్యలు తీసుకుంటాం-చైర్మన్ రఫాని

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందే-చైర్మన్ రఫాని

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య విభాగ సిబ్బంది పని చేయాలి-చైర్మన్ రఫాని

మున్సిపల్ పారిశుద్ధ్య మెస్ట్రీ లు, సెక్రెటరీ ల సమావేశంలో ఉద్గాటించిన చైర్మన్ రఫాని

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో పట్టణంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం-చైర్మన్ రఫాని

చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాలు నందు పారిశుద్ధ్య మెస్ట్రీ లు సెక్రటరీ లతో మున్సిపల్ చైర్మన్ రఫాని సమావేశం నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపర్చాలని ఆదేశాలు ఇచ్చారు. సీజనల్ వ్యాధులు తో ప్రజలు ఇబ్బందులు పడుకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలంలో రోడ్లపై వర్షపునీరు నిలబడకుండా పారిశుద్ధ్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షపునీరు ఎప్పటికప్పుడు డ్రైన్లు లో పారే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే భారీ డ్రైన్లు లో పూడికతీత పనులు ప్రారంభించమని…. సిబ్బంది కూడా ఆ విధంగా పని చేయాలని, లేకుంటే చర్యలు కఠినంగా తీసుకుం టామని హెచ్చరించారు