
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ముఖ్యఅతిధిగా హైద్రాబాద్ కలెక్టర్ శ్రీమతి హరిచందన దాసరి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ నేషనల్ పార్క్ లో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొని యోగాసనాలు వేయడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మరియు కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంతో ఆనందమయ జీవితం గడపడానికి యోగా ఎంతో మేలు చేస్తుందని అన్నారు. పని ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతున్న ప్రస్తుత బిజీ జీవితానికి యోగా ఎంతో అవరమని అన్నారు. సంప్రదాయక జీవితానికి దూరమై మన పనులు కూడా మనం చేసుకోకుండా ఎలక్ట్రిక్ పరికరాల మీద ఆదరపడుతున్న నేటి యాంత్రిక జీవితంలో యోగసనాలు వేయడం అందరికి ఎంతో అవసరమని, యోగా ద్వారా శారీరిక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుంది కాబట్టి మనమందరం యోగా ను ప్రతినిత్యం ఆచరిస్తూ, దినచర్యలో భాగం చేసుకోవాలని తెలియచేసారు.
