TEJA NEWS

జిల్లా గ్రంథాలయ సంస్థ పోటీల్లో బహుమతులు పొందిన గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు.. జగిత్యాల జిల్లా గ్రంధాలయ సంస్థ ఇటీవల జరిపిన వక్తృత్వ పోటీల్లో ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో చదువుతున్న పలువురు విద్యార్థులు పాల్గొని బహుమతులు పొందినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ. రామానుజమ్ తెలిపారు. వ్యాసరచన పోటీ (ఆంగ్లము) విభాగంలో ఎండి జవేరియ బేగం రెండవ బహుమతి… రంగోలి పోటీల్లో సి.హెచ్ కావ్య మొదటి బహుమతి… మెహందీ పోటీల్లో మహాబీన్ మొదటి బహుమతి సాధించినట్లు తెలిపారు.. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరిపిన ఈ పోటీల్లో . మొత్తం ఆరుగురు విద్యార్థులు వివిధ విభాగాల్లో పాఠశాల నుండి పాల్గొని ప్రశంస పత్రాలు పొందినట్లు వారు వివరించారు.. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ.రామానుజన్ ఉపాధ్యాయ సంఘ నాయకుడు బోనగిరి దేవయ్య జయశ్రీ రజాక్ రజిత శ్రీలత శ్రీనివాసరెడ్డి కమలాకర్ రెడ్డి కరుణాకర్ ..కుమార్..రాధిక.. జుబేర్ కుతుబుద్దీన్ సత్యనారాయణ తదితరులు అభినందించారు..


TEJA NEWS