విద్యార్థులు అన్ని క్రీడా పోటీల్లో రాణించాలి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి చర్చ్ గాగిల్లాపూర్ లోని సెయింట్ ఇగ్నటస్ వారు నిర్వహిస్తున్న వాలి బాల్ టోర్నమెంట్ కార్యక్రమంను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లాలని మరియు అదేవిధంగా అన్ని క్రీడా పోటీల్లో చురుకుగా పాల్గొని రాణించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమాని నిర్వహిస్తు యువతను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు రంజిత్ రెడ్డి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మా రావు, కౌన్సిలర్లు సుధాకర్ రెడ్డి, శంకర్ నాయక్, మహేందర్ యాదవ్, భారత్ కుమార్, మరియు నాయకులు, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు…