TEJA NEWS

బిల్లులు రాక.. దిగాలుతో సబ్ కాంట్రాక్టర్ జహీర్ గుండెపోటుతో మృతి..

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ జహీర్ గత మూడు సంవత్సరాలుగా చేసిన పనులకు బిల్లులు రాక.. పెట్టిన పెట్టుబడికి మిత్తిలు కట్టలేక.. చివరకు వావిలాల గ్రామంలో ఉన్న పది ఎకరాల పొలం ను అమ్మగా వచ్చిన డబ్బులను సగం అప్పును కూడా చెల్లించలేకపోయాడు.. సీసీ రోడ్డు.. మైనార్టీ కమ్యూనిటీ హాల్, మిషన్ భగీరథ ప్రభుత్వ పనులలో డబ్బులు పెట్టగా.. నేటి వరకు తిరిగిన డబ్బులు రాలేదు.. గద్వాల కలెక్టర్ కార్యాలయం నుండి హైదరాబాద్ వరకు.. ప్రజాప్రతినిధుల ప్రదక్షిణలు చేసిన బిల్లులు రాలేదు.. గత ప్రభుత్వ హాయంలో పనులు చేసిన పనులకు.. కొత్త ప్రభుత్వం వచ్చిన బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. కుటుంబ సభ్యులు.. సన్నిహితులు వాపోతున్నారు…

ప్రస్తుత ప్రజా ప్రతినిధులు అయిజ పట్టణంలో ( జహీర్ ) తను చేసిన ప్రభుత్వ పనులను పరిశీలించి బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయో పరిశీలించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని.. బాధా తప్త హృదయంతో సన్నిహితులు వాపోతున్నారు.. ఎప్పుడు చలాకీగా.. ఉంటూ పదిమందిని ఆప్యాయతతో పలకరిస్తూ ఉన్న జహీర్ ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు… ప్రజా ప్రతినిధులు జహీర్ కు న్యాయం చేయకపోయినా పర్లేదు… కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించి… కుటుంబానికి న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు…


TEJA NEWS