ఆగస్టు నుంచి రేషన్ లో కందిపప్పు, చక్కెర
రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు ఆగస్టు నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు లభించనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా పంపిణీ చేయనున్నారు. దీంతో ఆగస్టు నుంచి అక్టోబరు వరకు సరిపోయేలా కందిపప్పు, పంచదార,గోధుమపిండి సరఫరా కోసం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ల నుంచి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది.