TEJA NEWS

పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేడు (22-04-2024) మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీ, బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.

కావున టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము…

బయలుదేరు సమయం
ఎల్బీనగర్ చౌరస్తాలోని పార్టీ ఎన్నికల కార్యాలయానికి అన్ని డివిజన్ల నుంచి నేడు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోవాలని మనవి. పార్టీ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగినది.

భోజనం అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి నామినేషన్ సందర్భంగా జరగనున్న ర్యాలీ, సభలో పాల్గొనాల్సి ఉన్నది.

ర్యాలీ: దొంగల మైసమ్మ చౌరస్తా నుంచి అంతాయిపల్లి వరకు
సమయం: మధ్యాహ్నం 2 గంటలకు

బహిరంగ సభ జరుగు స్థలం :
అంతాయిపల్లి గ్రామం ( కలెక్టరేట్ సమీపంలో)
సమయం: మధ్యాహ్నం 2:30 గంటలకు

కావున ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మహిళా సేవాదళ్ విద్యార్థి యువజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తదితర విభాగాల ప్రతినిధులు అందరూ హాజరు కావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.


TEJA NEWS