
పాఠశాలల్లో ‘ఈగల్’ బృందాల పర్యవేక్షణ: అనిత
పాఠశాలల్లో ‘ఈగల్’ బృందాల పర్యవేక్షణ: అనిత
ఆంధ్రప్రదేశ్ : పాఠశాలల్లో ‘ఈగల్’ బృందాలు పర్యవేక్షిస్తాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘ఈగల్ బృందాలు పాఠశాలల్లో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా పని చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగును బాగా నియంత్రించామని, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మహిళల భద్రతకు శక్తి పేరిట ప్రత్యేక యాప్‌ను తీసుకొస్తామన్నారు.
