TEJA NEWS

సురక్ష గ్రీన్ మెడోస్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తా : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డి. పోచంపల్లి సురక్ష గ్రీన్ మెడోస్ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్రి ని కలిసి కాలనీ లో నెలకొని ఉన్న మౌళిక వసతులైన రోడ్ల నిర్మాణం, మంజీరా నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ అభివృద్ధికి గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పరచామని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త కాలనీలు వెలుస్తున్నాయని, రానున్న రోజుల్లో కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని బృహత్ ప్రణాళికతో మరింత అభివృద్ధి పరుస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సురక్ష గ్రీన్ మెడోస్ సంక్షేమ సంఘం సభ్యులు అధ్యక్షులు పి.వెంకటేశ్వర గౌడ్, ప్రధాన కార్యదర్శి కె. శ్రీరాములు, ఉపాధ్యక్షులు వి. సుధాకర్ రెడ్డి, పి. సుధాకర్ గౌడ్, సంయుక్త కార్యదర్శి మైసయ్య గౌడ్, సంక్షేమ సంఘం సభ్యులు సాంబశివరావు, అమర్నాథ్, భాస్కర్ రెడ్డి, వి.ఆర్.నాయుడు, మాల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS