TEJA NEWS

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడా లో గల సర్వే నెంబర్ 149లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని జీఓ నెంబర్ 59ను దుర్వినియోగం చేస్తూ రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని మరియు కాజాగుడా లోని సర్వే నంబర్ 27 లో ని ప్రభుత్వ భూమి ని పరిరక్షించాలని, సున్నం చెరువు ను మట్టి తో పూడ్చి అక్రమ లే ఔట్ వేసిన భూ కబ్జాదారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు మియాపూర్ నుండి పఠాన్ చెరువు వరకు నాగపూర్ నమూనా ప్రకారం డబుల్ డెక్కర్ ప్లై ఓవర్ మెట్రో మార్గం మరియు ఫ్లై ఓవర్ ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడా లో గల సర్వే నెంబర్ 149లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని జీఓ నెంబర్ 59ను దుర్వినియోగం చేస్తూ ఒక్కోరికి వేలాది గజాల స్థలాన్ని రాసిచ్చేశారని, జీఓ 59ను దుర్వినియోగం చేసిన అధికారులు , ప్రధాన సూత్రధారి పి. సురేందర్ అతని కుటుంబ సభ్యులు బినామిల పేర్ల మీదుగా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నాడు అని , చేసుకున్న కొన్ని గంటలలోనే కొన్ని నిర్మాణము సంస్థలకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది అని , 59 G.O కు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేసుకోవడం జరిగినది అని, ఎన్నికల కోడ్ అమలు లో ఉండగా ఈ తతంగం అంతా నడిపించారు అని , డాక్యుమెంట్లను ,అన్ని ఆధారాలను సమర్పించడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని,అక్రమంగా 59 G.O కు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేసిన స్థలాన్ని వెంటనే రద్దు చేయాలని PAC చైర్మన్ గాంధీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ని కోరారు.

ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న కోట్లాది రూపాయల వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జాలు చేసి జీఓ 59 కింద రెగ్యులరైజ్ చేశారని, కనీసం స్థల పరిశీలన కూడా లేకుండానే రెవెన్యూ అధికారులు కన్వినియెన్స్ డీడ్ చేశారని అన్నారు. జీఓ 59 నిబంధనలు తుంగలో తొక్కి రాత్రి సమయంలో రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరిపై వేల గజాల స్థలం రెగ్యులరైజ్ చేశారని, డీడ్ చేసుకున్న వ్యక్తి అదే రోజు రాత్రికి రాత్రే అమ్మేసుకున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల స్థలం చేతులు మారడంలో అధికారులు, కొందరు ప్రజా ప్రతినిధుల పాత్ర ఉందని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

కాజాగుడా లోని సర్వే నంబర్ 27 లో ని ప్రభుత్వ భూమి ని పరిరక్షించాలని, అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని , ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని

ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతాన్ని వెంటనే అరికట్టాలని, జీఓ 59ను దుర్వినియోగం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, అక్రమార్కుల పై , కఠిన చర్యలు తీసుకోవాలని , జీఓ 59 దుర్వినియోగం చేసిన అధికారులు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాలు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మా పై ఉంది అని, ప్రజా అవసరాల దృష్ట్యా ప్రభుత్వ స్థలాలను సద్వినియోగం చేసుకునేలా చూడలసింది పోయి , భూ అక్రమార్కులకు అండగా అధికారులు నిలవడం ఎంత వరకు సమంజసం అని , ఈ అక్రమ దందా లో ఉన్న ఎంతటి వారు ఉన్న ఉపేక్షించే ప్రసక్తే లేదు అని , ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యత మన అందరి పై ఉంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువు ను ఎకరాల కొద్దీ మట్టి పూడ్చి యథేచ్ఛగా కబ్జా చేసి అక్రమ లే ఔట్ లు వేసి కబ్జాలకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి సహకరించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని, ఫెన్సింగ్ తొలగించి కబ్జాలకు పాల్పడినరు అని, గతంలో అనేక ఫిర్యాదులు చేసిన ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు అని , ఇరిగేషన్ అధికారుల అలసత్వం వలన చెరువు కబ్జాకు గురి అయినది అని , తిరిగి చెరువు కు పూర్వ వైభవం వచ్చేలా యథాస్థితికి తీసుకువచ్చి చెరువును సంరక్షించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని PAC చైర్మన్ గాంధీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి ని కోరడం జరిగినది.

మియాపూర్ నుండి పఠాన్ చెరువు వరకు నాగపూర్ నమూనా ప్రకారం మెట్రో మార్గం మరియు ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ కోరారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం, ప్రజా సౌకర్యార్థం మియాపూర్ చౌరస్తా నుండి పఠాన్ చెరువు వరకు నాగపూర్ నమూనా ప్రకారం మెట్రో మార్గం మరియు ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గతంలో శాసన సభ సమావేశాలలో నేను మాట్లాడిన సంగతి విదితమే నని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ప్రజా సౌకర్యార్థం మియాపూర్ చౌరస్తా నుండి పఠాన్ చెరువు వరకు నాగపూర్ నమూనా ప్రకారం మెట్రో మార్గం మరియు ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ రోడ్డు మీద మియాపూర్ చౌరస్తా, ఆల్విన్ చౌరస్తా ల మీదుగా నిత్యం రోజు వారిగా లక్ష కు పైగా వాహనాలు ప్రయనిస్తున్నాయి అని, ఈ టాఫిక్ ఇక్కట్లు తప్పడానికి రెండు చౌరస్తాల మీదుగా ఇస్నాపూర్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని, ఈ విధానం ద్వారా నిర్మాణం సాఫీగా సాగునని, స్థలం సేకరణ, భవనాల తొలగిపు వంటి ఇతర అంశాలు అవసరం ఉండదు అని తక్కువ ఖర్చుతో త్వరితగతిన నిర్మాణం జరుగునని, ఫ్లై ఓవర్ నిర్మాణము సులభతరం అవుతుంది అని, వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ భూములును, చెరువులను సంరక్షిస్తామని ,డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ మెట్రో మార్గం నిర్మాణం ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలియచేసారు.


TEJA NEWS