హత్య కేసును ఛేదించిన సూర్యాపేట పోలీసులు.

హత్య కేసును ఛేదించిన సూర్యాపేట పోలీసులు.

TEJA NEWS

Suryapet police solved the murder case

హత్య కేసును ఛేదించిన సూర్యాపేట పోలీసులు.

  • నేరాలకు పాల్పడితే చట్టపరమైన కేసులు, శిక్షలు తప్పవు : రాహుల్ హెగ్డే IPS, సూర్యాపేట జిల్లా.

జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, DSP రవి, సూర్యాపేట రూరల్ CI, SI లతో కలిసి కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్.

తేదీ 23-05-2024 రోజు రాత్రి నల్గొండ జిల్లా, కట్టంగూర్ మండలం, రామచంద్రపురం గ్రామానికి చెందిన నందికొండ సైదులు కొడుకు నందికొండ వెంకన్న పనిచేసే ప్రవేట్ హౌస్ లోన్ ఫైనాన్స్ ఆఫీసుకు తేదీ 23-05-2024 రోజు ఉదయం 08.00 గంటలకు టేకుమట్ల నుండి సూర్యాపేటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని అతని గురించి వెతుకగా వెంకన్న మోటార్ సైకల్ రాయినిగూడెం గ్రామ శివారులో రాజుగారి తోట ఎదురుగా హైద్రాబాద్ నుండి విజయవాడ వెళ్ళే రోడ్డు ప్రక్కన పడి ఉన్నదని. చెప్పులు మరియు దస్తి కూడ ఉన్నదని పిర్యాదు ఇవ్వగా సూర్యాపేట రూరల్ PS నందు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. దర్యాప్తు లో భాగంగా వెంటనే మూడు టీం లను ఏర్పాటు చేసి డాగ్ స్కాడ్ మరియు క్లూస్ టీం లను రప్పించి కేసు మిస్టరీని ఛేదించినారు.

మృతుడు నందికొండ వెంకన్న 2022 సం.లో తన స్నేహితుడైన బెజవాడ రాజశేఖర్ ను డబ్బుల పంచాయితీ విషయంలో హత్య చేసినాడు. అట్టి విషయంలో కట్టంగూర్ పోలీసు స్టేషన్ లో హత్య చేసు నమోదు అయినది. బెజవాడ రాజశేఖర్ కుటుంబసభ్యులతో తనకు ప్రాణ హాని ఉన్నదని బెయిల్ పై వచ్చి టేకుమట్ల గ్రామములొ తన పెద్దమ్మ ఇంట్లో ఉంటున్నాడు. రాజశేఖర్ హత్యకు ప్రతీకారంగా గత 2 సం.ల నుండి నందికొండ వెంకన్న ను హతమార్చుటకు రాజశేఖర్ స్వంత అన్న ఆయిన బెజవాడ రమేష్ తండ్రి లింగయ్య, వయస్సు: 29 సం.లు, నందికొండ వెంకన్న ఇంకో స్నేహితుడైన ఖమ్మంపాటి సైదులు కలిసి వెంకన్న టేకుమట్ల గ్రామములొ ఉంటున్న విషయం తెలుసుకొని వెంకన్నను చంపుటకు రెక్కి చేసినారు. కానీ విలుపడలేదు. రాజశేఖర్ ను 31-05-2022 లో చంపినందున ఈ ‘మే’ నెలలో ఎలాగైన హత్య చేయాలని అనుకోని 21-05-2024 నుండి ప్రతిరోజు ఉదయం 07.00 గంటలకు రమేష్ యాక్టివ స్కూటి పై టేకుమట్లకు వచ్చి వెంకన్న వచ్చి వెళ్ళిది రెక్కి చేసినారు. తేదీ 23-05-2024 రోజు నందికొండ వెంకన్నను ఎట్లాగైన చంపుదామని అనుకోని బెజవాడ రమేష్, సైదులు కలిసి నందికొండ వెంకన్నను చంపుటకు సహకరించమని రాజశేఖర్ స్వంత బాబాయి అయిన బెజవాడ జానయ్యకు, బోడ సతీష్ కుమార్, ఇస్లావత్ సురేష్ కు చెప్పగా వారు కూడ సరే అన్నారు. తేదీ 23-05-2024 రోజు తెల్లవారు జామున ఖమ్మంపాటి సైదులు యొక్క మహేంద్ర సుప్రో TS-12-EC-6648 నెంబర్ గల వాహనంలో రమేష్, ఖమ్మంపాటి సైదులు, బోడ సతీష్ కుమార్, ఇస్లావత్ సురేష్ బెజవాడ జానయ్యలు టేకుమట్లకు ఉదయం 06.45 గంటల సమయంలో వచ్చి టేకుమట్లలో క్రాస్ రోడ్డు వద్ద వెంకన్న గురించి ఎదురు చూస్తుండగా ఉదయం అందాజ 08.15 గంటలకు నందికొండ వెంకన్న తన మోటార్ సైకల్ పై సూర్యాపేటకు వెల్లుచుండగా వెనుక నుండి ఫాలో అయి రాజు తోట ఎదురుగా వచ్చిసరికి మహేంద్ర సుప్రో వాహనంతో సైదులును వెనుక నుండి గుద్దగా వెంకన్న మోటార్ సైకల్ పై నుండి రోడ్డు ప్రక్కకు పడిపోయినాడు. పై వారు వెంకన్నను వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని మోతే గ్రామశివారులోని తీసుకొని వెళ్ళి తాడుతో వెంకన్న మెడకు చుట్టి లాగి చంపి అక్కడే ఉన్న కర్రలు శవము పై వేసి పెట్రోల్ పోసి తగలపెట్టినారు.
ఇట్టి కేసులో మొదటి ముద్దాయి అయిన బెజవాడ రమేష్ తండ్రి లింగయ్య, వయస్సు: 29 సం.లు, రసూల్ గూడెం గ్రామము, కట్టంగూర్ మండలం, నల్గొండ జిల్లా అను అతని తేదీ 26-05-2024 రోజు పట్టుబడి చేసి జుడీషియల్ రిమాండ్ కు పంపనైనది.

ఇట్టి కేసును ఛేదించిన సూర్యాపేట డి‌.ఎస్‌.పి జి.రవి, సి.‌ఐ వై. సురేంధర్ రెడ్డి, సూర్యాపేట రూరల్ ఎస్‌.ఐ యన్. బాలు నాయక్ ను వారి సిబ్బందిని జిల్లా ఎస్‌.పి రాహుల్ హెగ్డే IPS అభినంధించినారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS