యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు
యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు: వివేకానంద రైసింగ్ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు
మందలో ఒకరిగా ఉండకు,వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు, బద్ధకమే అసలు పాపం:అదే పేదరికానికి కారణం.. అనే ఇలాంటి వందల సూక్తులతో ఎంతో మంది యువతను పేరేపరించి,యువతకు రోల్ మోడల్ గా నిలిచిన స్వామి
వివేకానంద 122 వ వర్ధంతి సందర్భంగా,వివేకానంద రైసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని వీధి నెంబర్ 28 లో గల స్వామి వివేకానంద విగ్రహానికి వివేకానంద రైసింగ్ సొసైటీ సభ్యులు పూలమాలలువేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వివేకానంద రైసింగ్ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహాపురుషుడు స్వామి వివేకానందుడు అని అన్నారు.ఈ తరం యువకులు అంతా స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రజా సేవకు తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కుమ్మరి రాజు, నితిన్ కుమార్, అఖిల్, వినయ్, ప్రశాంత్, లలిత, లచ్చయ్య , తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.tejanews.app
Teja news
Download App