TEJA NEWS

ఏపీ రాష్ట్ర ప్రజలకు తీపికబురు.. క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలు!..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకలను తిరిగి అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

త్వరలోనే క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలు అందజేస్తామని ఏపీ మంత్రి బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.

అలాగే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పథకాలను తిరిగి అమల్లోకి తెస్తామన్నారు.

విజయవాడలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే క్రిస్మస్, సంక్రాంతి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ క్రిస్మస్, సంక్రాంతి నుంచే ఈ పథకాలు అమలు చేస్తారా.. లేదా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది


TEJA NEWS