
పంట నష్టపోయిన రైతులకు తీపికబురు..
పరిహారంపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
పసుపు పంటకు మద్దతు ధర వస్తేనే.. ఆ రైతు తలెత్తుకుని ఉండగలడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
ఇవాళ ఆయన నిజామాబాద్ లో రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణా రావు తో కలిసి పారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ కు సాటి వచ్చే మరో రాష్ట్రంలో దేశంలోనే లేదని అన్నారు. రాష్ట్రానికి పుసుపు పారాణిలాంటి జిల్లా నిజామాబాద్ అని తెలిపారు. అన్నదాతలకు రూ.2 లక్షల వరకు ఓకే విడతలో రుణ మాఫీ చేసి ఘటన తెలంగాణకే దక్కిందన్నారు. కొన్ని కారణాల వల్ల ‘రైతు భరోసా’ అర్ధంతంరంగా నిలిచిపోయిందని కామెంట్ చేశారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు.
బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చినా.. అన్న పథకాలను నిలిపివేసిందని తెలిపారు. ఇక గత పదేళ్లలో వ్యవసాయ యంత్ర పరికరాలను బీఆర్ఎస్ ఇచ్చిన పాపాన పోలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ యంత్ర పరికరాల పంపిణీ పునరుద్ధరించామని అన్నారు. ప్రతి జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగు పెరగాల్సి ఉందని తెలిపారు. ఒకవేళ ఆయిల్‌పామ్ సాగు చేయకపోతే రైతులే నష్టపోయే పరిస్థితి వస్తుందని అన్నారు. 4 ఎకరాల వరి సాగులో వచ్చే లాభం ఎకరం ఆయిల్‌పామ్‌తో తోటతో వస్తుందని కామెంట్ చేశారు. దేవరకొండలో ఓ రైతు కుంకుడకాయల సాగుతో రూ.6 లక్షలు సంపాదిస్తున్నాడని గుర్తు చేశారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే పరిహారం అందజేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు.
