చేవెళ్లలో ఓటు వేసిన బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్లలో ఓటు వేసిన బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల మండల కేంద్రంలో బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సంగీత రెడ్డి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్ళు ఓటు వేశారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటికి రావాలని, తమ ఓటును సరైన నాయకుడికి వేసి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్

శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి అనుబంధ గ్రామమైన కొజ్జగూడెంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో శివ యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి…

చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు

చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు

బుల్కాపూర్, చిన్న శంకర్‌పల్లి వార్డులలో ఎన్నికల ప్రచారం: నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ శంకర్‌పల్లి:దేశంలో, రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ బీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలోని బుల్కాపూర్, చిన్న శంకర్‌పల్లి వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరు గ్యారంటీలను వివరిస్తూ హస్తం గుర్తుకు…

చేవెళ్లలో 64 కేజీల గంజాయి పట్టివేత

చేవెళ్లలో 64 కేజీల గంజాయి పట్టివేత

చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్ పల్లి చౌరస్తాలో 16 లక్షలు విలువచేసే 64 కేజీల గంజాయిని తరలిస్తున్న నలుగురిని చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి తెలంగాణ మీదగా మహారాష్ట్రకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చేవెళ్లలో ఎస్ఓటీ పోలీసులతో కలిసి చేవెళ్ల పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారంమహారాష్ట్ర రాష్ట్రానికిచెందిన చిత్ర కౌలాస్ మోహితి(35), నౌనాథ్ గణపత్ చౌహన్(70), మాధన్బాలసాహెబ్ బయస్ (38), రాజేష్ సుభాష్ మోహితే(15) నలుగురిని అక్రమ మార్గంలో…