Teachers of private schools should vote for Tinmar Mallanna and win
ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు తీన్మార్ మల్లన్న కు ఓటు వేసి గెలిపించాలి : టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది పట్టభద్రుల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న తన ఛానల్ ను ఒక ఆయుధంగా చేసుకుని బిఆర్ ఎస్ పార్టీపై, అప్పటి సిఎం కెసిఆర్ పై అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం డిఎస్పి ని మరచిపోయిందని అన్నారు. ఎన్నికల కోడ్ తరువాత తెలంగాణ రాష్ట్రములోని కాంగ్రెస్ ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెగా డిఎస్పి నిర్వహిస్తుందని అన్నారు. నిరుద్యోగ యువత తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇచ్చి, పట్టభద్రుల ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తాను పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా క్యాబినెట్ హోదా పదవిలో వున్నానని, సూర్యాపేట ప్రాంతం అభివృద్ధి కి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, కౌన్సిలర్ షఫి, ప్రముఖ వైద్యులు ఊర రామ్మూర్తి, నాయకులు జ్యోతి కరుణాకర్, రమేష్ నాయుడు, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, ధర్మా నాయక్ తదితరులు పాల్గొన్నారు.