TEJA NEWS

తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పలు సమస్యల పై గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా నాయకులు శోభన్ మరియు సిఐటియు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు

1 అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మరియు మినీ టీచర్లు ప్రతినెల జీతాలు సకాలంలో వచ్చే విధంగా చూడాలని కోరారు

2 అంగన్వాడి కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించే విధంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు

  1. మినీ అంగన్వాడి సెంటర్లను ప్రభుత్వం మెయిన్ సెంటర్ గా గుర్తించినప్పటికీ టీచర్లకు రావాల్సిన జీతభత్యాలు వచ్చే విధంగా చూడాలి
  2. అంగన్వాడి కేంద్రాలకు అద్దె భవనాలకు ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తుంది కానీ మహానగరంలో అద్దె భవనాలు 10000 రూపాయలు టీచర్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కావున రూము రెంట్లు ను పెంచే విధంగా చూడాలని కోరారు.
  3. అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్పర్లకు మినీ టీచర్లకు డబల్ బెడ్ రూములు వచ్చే విధంగా చూడాలి అని కోరారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ ఉద్యోగుల సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని , తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని ,మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ,ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు నాగమణి, శ్రీలత, మరియు టీచర్లు లక్ష్మీ, ప్రవీణ ,లక్ష్మీకాంతం, జ్యోతి, ప్రవీణ, త్యాయర్ ఉన్నిసా మరియు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS