తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024 – 25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది..
నీటిపారుదల అంశాలపై చర్చతో సమావేశాలు వేడెక్కనున్నాయి. రెండు నెలలలోపే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి మరోమారు ప్రసంగించనున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ మండలి సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఇవాళ ప్రసంగించనున్నారు..
ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు శాసనసభ సభా మందిరంలో సంయుక్త భేటీ జరగనుంది. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్ తొమ్మిదో తేదీన రాష్ట్ర మూడో శాసనసభ మొదటిసారి కొలువు తీరింది. కొత్త శాసనసభ ఏర్పాటు అయిన సందర్భంగా ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. తాజాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రెండు నెలల లోపే మరోమారు గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, మండలి రేపటికి వాయిదా పడతాయి. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశం అవుతాయి. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండాను బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్ లో రేపు చర్చ, సమాధానం ఉండనున్నాయి..