TEJA NEWS

నిండు సభలో తెలంగాణ ఆడబిడ్డ ను కంటతడి పెట్టించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల…

కెటీఅర్ పిలుపుతో ప్రగతి నగర్ త్రి మంకీస్ సర్కిల్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం…

సీఎం రేవంత్ రెడ్డి బిఅర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఅర్ పిలుపుతో మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద ఆదేశానుసారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ త్రి మంకీస్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద ఎన్ఎంసి డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బి అర్ ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసారు. వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, మహిళా నాయకులు, ఎన్ఎంసి బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS