విద్యా శాఖను నిర్వీర్యం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

విద్యా శాఖను నిర్వీర్యం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

TEJA NEWS

కమలాపూర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి గత 7 నెలలు గడిచిన ఇప్పటివరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విడ్డూరంగా ఉందని కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024- 25 విద్యా సంవత్సరం ప్రారంభమైన ఇప్పటివరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇతరత్రా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మరియు ఫీజుల నియంత్రణ లేక ప్రైవేట్ స్కూల్ మరియు కాలేజ్ సంబంధించిన యజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు నోట్ బుక్స్ స్కూల్ యూనిఫామ్ ఇతరత్రా విద్యార్థులకు సంబంధించిన సామాగ్రిని అధిక ధరలకు అమ్ముతూ మా వద్దనే ఇవి కొనుగోలు చేయాలని ప్రైవేట్ స్కూల్లో యజమాన్యాలు విద్యార్థి తల్లిదండ్రులను డిమాండ్ చేస్తున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి వారి ఆధ్వర్యంలో ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటుచేసి అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో హనంకొండ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బండి కోటేశ్వర్ కమలాపూర్ మండల ఉపాధ్యక్షులు భోగి బిక్షపతి మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పెండ్యాల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి