
కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బండి రమేష్ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) శిక్షణ కార్యక్రమం కూకట్ పల్లి వై జంక్షన్ NKNR గార్డెన్స్ లో BLA లకు ఓటరు జాబితా సవరణ SIR పై శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా AICC జనరల్ సెక్రటరీ సతీష్ సావంత్ , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ , టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ తెలంగాణ బ్రాహ్మణ సంఘం వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్ , టి పి సి సి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం , బ్లాక్ అధ్యక్షులు తూము వేణు , పటోళ్ళ నాగిరెడ్డి , మార్కెట్ కమిటి చైర్మన్ పుష్పా రెడ్డి హాజరై BLAలకు పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం శిక్షణ శిబిరం ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటం, అక్రమాలు జరగకుండా అప్రమత్తంగా ఉండటం, ప్రతి ఇంటికి చేరుకుని ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం మనందరి బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ముందుంటుంది.
అందుకే లోక్ సభ ప్రతి పక్ష నాయకులు కాంగ్రెస్ పార్టి అగ్ర నేత రాహుల్ గాంధీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టి పి సి సి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరం ద్వారా BLAలు మరింత సమర్థవంతంగా పనిచేసి, ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి BLA కాంగ్రెస్ పార్టీకి కస్టపడి పనిచేసి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాబోయే కార్పొరేషన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి జండా ఎగరావేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అద్యక్షులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ , డివిజన్ అధ్యక్షులు ,బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, nsui నాయకులు, మైనారిటీ నాయకులు, sc సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు ,సేవ్ దళ్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.