
వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన వెంకటేష్ గౌడ్
శంషిగూడ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ ఆశా నగర్ హైటెన్సన్ లైన్ రోడ్డు లో యాభై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి కాలువ (బాక్స్ డ్రైన్) నిర్మాణ పనులను ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు తెలియచేసారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ నిర్మాణ పనులను ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, అంజయ్య యాదవ్, ధాతి రమేష్, నిరంజన్, నాగేష్ గౌడ్, మల్లేష్, రాజు గౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.