TEJA NEWS

రైతు, సైనికుడి ఆవశ్యకతను పిల్లలకు తెలియజేస్తూ ఇలాంటి ఫుడ్ ఫెస్ట్ నిర్వహించడం అభినందనీయం : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ..

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ లోని శ్రీనిధి గ్లోబల్ స్కూల్ నందు “జై కిసాన్ – జై జవాన్” థీమ్ తో నిర్వహించిన రైతు బజార్ ఫుడ్ పేస్ట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… దేశానికి రైతు, సైనికులు ఇద్దరూ ముఖ్యమేనని, రైతు – సైనికుడి ఆవశ్యకతను పిల్లలకు తెలియజేస్తూ ఇలాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించిన స్కూల్ యాజమాన్యానికి నా అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, నాయకులు సంపత్ గౌడ్, చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS