TEJA NEWS

మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన పదవ తరగతి స్నేహితులు

హనుమకొండ జిల్లా కమలాపూర్

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పూర్వ విద్యార్థులు తమ బాల్య స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని ఆర్థిక సాయం అందించి గొప్ప మనసును చాటుకున్నారు. మండల కేంద్రానికి చెందిన అట్ల చంద్రమౌళి కి అతని బాల్య స్నేహితులు 28 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు 50 కిలోల బియ్యం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన అట్ల ఎల్లయ్య – కొమురమ్మ దంపతులు అనారోగ్య కారణాలతో 20 రోజుల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మరణించారు. దీంతో అట్ల చంద్రమౌళి కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. విషయం తెలుసుకున్న చంద్రమౌళి బాల్య స్నేహితులు కష్టాల్లో ఉన్న ఆయన కుటుంబాన్ని చూసి చలించిపోయి తమ వంతుగా ఎంతో కొంత సాయం అందించాలని 1994 – 95 జెడ్ పి ఎస్ ఎస్ టెన్త్ బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు అందరూ నిర్ణయించుకొని తలా కొంత ఆర్థిక సాయం చేసి మొత్తం 28 వేల రూపాయలు జమచేసి తమ చిన్ననాటి స్నేహితుడైన అట్ల చంద్రమౌళికి అందజేసి అండగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి 1994 – 95 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు శోభన్ బాబు, రాంబాబు, మహేందర్ రెడ్డి, శివకుమార్, లింగయ్య, లక్ష్మణ్, చంద్రశేఖర్,సుధాకర్,
కుమారస్వామి, రాజ్ కుమార్, సతీష్, రమేష్ తదితరులు ఉన్నారు. కష్టాల్లో ఉన్న బాల్య స్నేహితుని చూసి జాలి పడటమే కాకుండా అతని కష్టాల్లో పాలు పంచుకున్న అట్ల చంద్రమౌళి స్నేహితులను పలువురు ప్రశంసించారు.


TEJA NEWS