TEJA NEWS

20 నుంచి ఆన్లైన్లో రాతపరీక్షలు

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాతపరీక్షలు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి

వెబ్సైట్లో టెట్ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశ ముంటుంది. జూన్ రెండో తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈనెల 20, 21, 22, 24, 28, 29 తేదీల్లో పేపర్-2, ఈనెల 30, 31, వచ్చేనెల ఒకటి, రెండో తేదీన పేపర్-1 రాతప రీక్షలు జరుగుతాయి. వచ్చేనెల ఒకటో తేదీన పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ అభ్యర్థులకు మైనర్ మీడి యంలో రాతపరీక్ష ఉంటుంది

రాష్ట్రవ్యా ప్తంగా టెట్కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్- 1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,428 మంది ఉన్నారు. ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, వచ్చేనెల నాలుగో తేదీన సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉన్న విషయం తెలిసిందే. ఆయా తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించకుండా అధికారులు కసరత్తు చేశారు


TEJA NEWS