TEJA NEWS

కార్పొరేట్ స్థాయి విద్యా ఉచితంగా అందుబాటులో ఉంచాలన్నదే ప్రత్తిపాటి లక్ష్యం : వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి

10 వ వార్డు మున్సిపల్ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ఆత్మీయ సమావేశం..

చిలకలూరిపేట : స్థానిక 10వ వార్డు లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో గురువారం మెగా పేరెంట్, టీచర్ ఆత్మీయ సమావేశం
ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ
నిర్వహించారు. కార్యక్రమంలో విచ్చేసిన వారికి విద్యార్థినులు గులాబీ పువ్వులను అందించారు,ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి
,పార్టీ నాయకులు యూనిట్ ఇంచార్జి, షేక్ అబ్దుల్ మజీద్.వార్డు సెక్రటరీ షేక్ దరియా వలి, పాఠశాల పేరెంట్ కమిటీ ఛైర్మెన్ ఎస్.విజయ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు,ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన విధానాన్ని అందించాలని కృత నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు.
స్థానిక శాసన సభ్యులు మాజీమంత్రి వర్యలు ప్రత్తిపాటి పుల్లారావు సారు కూడా పేద ప్రజలకు సంబంధించిన పిల్లలకు ఉచితంగా అత్యున్నతమైన విద్యానందించాలనే , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి, కేంద్రీయ విద్యాలయం,గురుకుల పాఠశాల,ముస్లిం మైనార్టీ బాలికల పాఠశాల లాంటి ఎన్నో ప్రభుత్వ పాఠశాలలను ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగిందనీ.పేద పిల్లలు చదువుకుంటేనే వారి భవిష్యత్తు బాగుంటుందని భవిష్యత్ తరాలకోసం ఎంతో ముందు చూపుతూ ఇటువంటి కార్యక్రమాలను పుల్లారావు సారు తీసుకురావడం జరిగిందని,విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలలో చదివించుకుని పిల్లల భవిష్యత్తు కు మంచి మార్గాన్ని అందించాలని కోరారు.
అదే విధముగా పాఠశాలలో కావలసిన మౌలిక వసతులు , సదుపాయాలు కల్పనలో మా సహకారం ఎల్లపుడు అందిస్తామని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పిల్లలకు విద్యానందించాలని
కోరారు.యూనిట్ ఇంచార్జి షేక్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలలో ఈ ప్రాంతంలో ఉన్న మధ్య తరగతి ,దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు చదువు కునేందుకు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు, గతంలో ఇదే పాఠశాలలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని
ఫర్జాన్ పర్వీన్, విద్యార్ధుల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.