TEJA NEWS

Alert.. low pressure as air mass..

అలర్ట్.. వాయుగుండంగా అల్పపీడనం..

_ ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నెల 26 తేదీ సాయంత్రానికి అది మరింత బలపడి తుపానుగా మారుతుందని స్పష్టం చేసింది.

ఈశాన్యంగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నప్పటికీ.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పేమీ లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షంతోపాటు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

వాయుగుండంగా మారనున్న బలమైన అల్పపీడనం కారణంగా.. రెండు రోజుల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం.. వాయుగుండంగా మారునుండడంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షం పడనున్నట్లు వాతావరణశాఖ చెప్పింది.

ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుండి కొన్ని చోట్ల భారీ వర్షాల పడే ఛాన్స్ ఉందంది.

అటు.. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.


TEJA NEWS