TEJA NEWS

పటాన్చెరు పట్టణం :శ్రీ వేణుగోపాల స్వామి గుడి వార్షికోత్సవం వైభవంగా జరిగింది

పటాన్చెరు పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి గుడిలో వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ప్రత్యేక అతిథిగా బీఆర్ఎస్ యువ నాయకుడు
ఐలాపూర్ మాణిక్ యాదవ్ హాజరయ్యారు.

కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ , రాజు యాదవ్ , సతీష్ యాదవ్ , శ్రీనివాస్ యాదవ్ , పురుషోత్తం రెడ్డి , మహేష్ పటేల్ , వేద శ్రీనివాస్ , కళ్యాణ్ , సతీష్ పాల్గొన్నారు.

పటాన్చెరు నియోజకవర్గంలోని పెద్దలు, యువకులు పెద్దఎత్తున హాజరై వేడుకలకు విశిష్టతను చేకూర్చారు.